నేటి నుంచి తెలంగాణలో రైతు బీమా సర్వే

Update: 2018-06-06 06:37 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రైతు బీమా సర్వే.. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో.. పట్టాదారు పాసుపుస్తకం పొందిన, రైతుబంధు చెక్కులు తీసుకున్న ప్రతీ రైతు ఇంటికెళ్లి.. వ్యవసాయ విస్తరణ అధికారులు.. వివరాలు సేకరించనున్నారు. 18 యేళ్ల నుంచి 60 యేళ్ల వయస్సున్న వారిని గుర్తించి.. తర్వాత వారికి నామినీ పత్రాలు అందజేయనున్నారు. అదే సమయంలో వారి నుంచి సంతకాలు సేకరించి.. పత్రాలను తిరిగి తీసుకోనున్నారు. వీటన్నింటినీ ఎల్ ఐసీకి అందజేస్తారు. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం రైతు బీమాను వర్తింపజేస్తామని ఇదివరకే ప్రకటించింది. సుమారు 42 లక్షల 94 వేల మంది రైతులకు నామిని పత్రాలు ఇస్తామంటున్న అధికారులు.. పెట్టుబడి చెక్కులు, పాసు పుస్తకాలు పొందని వారు కూడా రైతు బీమా పరిధిలోకి వస్తారని.. స్పష్టం చేశారు. 

Similar News