సమంత ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందా..?

Update: 2018-01-30 08:52 GMT

2019 ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల‌కోసం అన్వేష‌ణ ప్రారంభించాయి. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ క‌న్ను సింకిద్రాబాద్ ఎమ్మెల్యే స్థానం పై ప‌డిన‌ట్లు టాక్. అక్క‌డ  క్రిస్టియన్ సామాజిక వ‌ర్గం దే పై చేయి. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి క‌న్వెర్ట‌డ్ క్రిస్టియ‌న్ గా ఉన్న జ‌య‌సుధ‌తో పోటీ చేయించి విజ‌యం సాధించింది. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ అదే ఎత్తుగ‌డ‌తో పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు అదే అసెంబ్లీ స్థానంపై ఓ వార్త ఫిల్మింన‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతుంది. హీరోయిన్, అక్కినేని స‌మంత‌ను ఇదే స్థానం నుంచి పోటీ చేయిస్తే గెలుపు త‌ధ్య‌మ‌ని టీఆర్ఎస్ పార్టీ నేత‌లు భావిస్తున్నార‌ట‌. దీనికితోడు మంత్రి కేటీఆర్ కు , అక్కినేని ఫ్యామిలీతో స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే సమంతను తెలంగాణలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని అంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల దృష్టిలో ఉంచుకున్న టీఆర్ఎస్ పార్టీ స‌మంత‌ను అక్క‌డి నుంచి పోటీ చేయిస్తే స్టార్ ఇమేజ్, సీమాంధ్ర ఓటర్ల ప్రభావం, క్రిస్టియన్ ఓట్లు త‌మ‌కే ప‌డ‌తాయ‌ని కేటీఆర్ లెక్క అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే సమంత పోటీ విషయంలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి ఏ మేరకు నిజం అవుతాయో చూడాలి. 

Similar News