మొదటి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్ పై కూడా పైచేయి సాధించాలని అనుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిన్న(శుక్రవారం) లంచ్ విరామ సమయానికి వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేయగా.. అనంతరం మరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్.. ఈ దశలో వెస్టిండీస్ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (174 బంతుల్లో 98 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి చేరువ కాగా, కెప్టెన్ హోల్డర్ (92 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. చేజ్, హోల్డర్ లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఉమేష్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ తీశారు. మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొడతారా లేక విండీస్ పట్టుబిగిస్తుందో అన్నది నేటి సెషన్ లో తేలనుంది.