బాహుబలితో ప్రపంచ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కు సిగ్గెక్కువ. మరి అలాంటి ప్రభాస్ స్టార్ ఎదగడానికి ఓ కారణం ఉందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాహోతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్నివెల్లడించాడు. మీకు సిగ్గుఎక్కువ అనే విషయాన్ని చాలా సార్లు చర్చించారు. మరి చుట్టూ వందల మంది ఉన్న షూటింగ్ స్పాట్‌లో బిడియం లేకుండా ఎలా నటించారు. అనే ప్రశ్నపై స్పందించిన ప్రభాస్..1976లో శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శివ భక్తుడి జీవిత ఆధారంగా తన పెద్దనాన్న కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’.అనే సినిమా చేశారు. ఆ సినిమా చూసిన తర్వాత నిమాలను కెరీర్‌గా ఎంచుకోవాలని, నటుడు కావాలని ప్రభాస్ ప్రేరణ పొందారట. ఈ సందర్భంగా శ్రద్ధాకపూర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె పాత్ర కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం కాదు. కథకు ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెపై అద్భుతమైన సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.