ఎట్టకేలకు రాంచరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా టాక్ తో చరణ్ వెనక్కి తగ్గాడని వార్తలు వచ్చాయి. సరైనోడు అభిమానులు అంచనాలకు అందుకోలేకపోయినా సినిమా టేకింగ్ చరణ్ కు నచ్చిందట. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి కాంబినేషన్ లో జయ జానకి నాయక అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో బోయపాటితో సినిమా చేసేందుకు చర్రీ ఫిక్స్ అయ్యారాట. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం జనవరి 19 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఫిల్మినగర్ వర్గాల ప్రకారం చర్రీ నటించే 12వ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్, కైరా అడ్వాణీ.. వీరిద్దరిలో ఒకర్ని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. డేట్స్ వీలును బట్టి ఇద్దరిలో ఒకర్ని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం.