ఒడిషా తీర ప్రాంతంలో తొమ్మిది కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయన్నారు. ఈ రోజు అత్యధికంగా విశాఖలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.