తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం బిలాస్‌పూర్‌లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.