ఏపీకి ప్రత్యేకహోదా, ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానం, కేంద్రం ఏపీకి చేస్తున్న సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల్ని, ఎంపీలతో భేటీ అవుతున్నారు. కేంద్రం తీరును తూర్పారబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సహయం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలపై బీజేపీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎంతో చేశామని, ఇంకా ఎంతో చేయనున్నట్టు ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేశామని చెప్పారు. ఇంకా సహయం చేస్తామని సూచించారు.
స్నేహనికి ప్రాధాన్యత తాము స్నేహనికి విలువ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కానీ, స్నేహం కంటే భారత ప్రజలు భారత అబివృద్దికి ప్రాధాన్యతను ఇస్తారని ఆయన చెప్పారు. తమ స్నేహనికి టీడీపీ వదులుకుందని జవదేకర్ గుర్తు చేశారు.టీడీపీ తమను విడిపోయినా తాము ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆపలేదని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామని జవదేకర్ చెప్పారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిది, ఎంపీ, జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానమైన నిధులను ఇస్తామని ఏపీకి చెప్పినా ఆ రాష్ట్రం ఆ నిదులను వాడుకొనే పరిస్థితిలో లేదన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దిపై చంద్రబాబునాయుడు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల విషయమై ఏపీ రాష్ట్రానికి జవాబుదారీతనం లేదన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో తాము వివక్ష చూపామని ఏనాడు కూడ విమర్శలు రాలేదని ఆయన గుర్తు చేశారు.