దారుణ హత్యకు గురైన మహిళ

Update: 2018-08-11 02:19 GMT

ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మిట్ల కృష్ణవేణి (32) నిన్న నెల్లూరు జిల్లా కావలి అడవిలో మహిళ మృతదేహంగా పడిఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని కొందరు బొంతరాయితో మహిళ తల వెనుక భాగంలో మోది ఆమెను చీరతో ఉరేయడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద బ్యాగ్‌ ఉంది. అందులో బ్యాంక్‌ పాస్‌పుస్తకం, ఫోన్, చిల్లర నగదు, ఇతర వస్తువులున్నాయి. పాస్‌పుస్తకం ఆధారంగా ఆమె స్వగ్రామం ప్రకాశం జిల్లా కొనకలమిట్లగా గుర్తించారు. కాగా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. 

Similar News