వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర 50వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా సీటీఎం నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. పులవాండ్లపల్లి, వాల్మీకిపురం, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిలవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగనుంది. జిల్లాకో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన బాబు మాట తప్పారని, రుణమాఫీ విషయంలో అదే జరిగిందని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు కోసం వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొంటున్నారు.