హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో పవన్ కల్యాణ్ ను విమర్శలు చేస్తున్న కత్తిమహేష్ ను ఉద్దేశించి హీరోయిన్ పూనమ్ కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పై స్పందించిన కత్తి ప్రెస్ మీట్ లో ఆమె పై వ్యక్తిగత విమర్శల వర్షం గుప్పించారు. ఆ తరువాత కోడి గుడ్లదాడితో వివాదం తారాస్థాయికి చేరడంతో మెగా బ్రదర్ నాగబాబు పరిష్కరించినట్లు తెలుస్తోంది. చిరు తమ్ముడు నాగేంద్రబాబు చొరవతోనే వివాదం ముగిసిందని జనసేన నాయకుడు కల్యాణ్ సుంకర ఓ టీవీ ఛానల్ చర్చలో చెప్పారు. ‘ఈ అనవసర వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని పవన్ అభిమానులకు నచ్చజెప్పారు. నాగబాబు ఆలోచన , కత్తిమహేశ్ పెద్ద మనసు వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో పూనమ్ ఆసక్తికర ట్వీట్ చేసింది. అయితే పవన్ కల్యాణ్ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని.. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది.
ఆమె చేసిన ట్వీట్:
‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. అదే పీకే ప్రేమ. తెలుసుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉందా? ఇంకా ఎవరైనా వస్తారా?’’ అంటూ ట్వీట్ చేసింది.