పవన్ కల్యాణ్ ను విమర్శలు చేస్తున్న కత్తిమహేష్ ను ఉద్దేశించి హీరోయిన్ పూనమ్ కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పై స్పందించిన కత్తి ప్రెస్ మీట్ లో ఆమె పై వ్యక్తిగత విమర్శల వర్షం గుప్పించారు. ఈ నేపథ్యంలో పూనమ్ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చేసింది మహేష్ గురించేనని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
రీసెంట్ గా వివాదాల వర్మ జీఎస్టీ పేరుతో ఓ చిత్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో ఓ పోర్న్ స్టార్‌తో చేసిన చిత్రానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో చూసిన మహేష్ పోర్న్ స్టార్ మియా మల్కోవాని పొగుడుతూ ట్వీట్ చేశారు
"మియా రూపం. గొంతు. వర్మ షాక్ వాల్యుతోపాటు, ఎం.ఎం.కీరవాణి నేపధ్య సంగీతం ఒక ఎపిక్ విలువని జోడించింది. గుండె దిటవు చేసుకుని. మెదడు విప్పారజేసి చూడండి. నాకులాగా మీరూ ఎదురుచూస్తారు. మొత్తం ఫిల్మ్ ఎప్పుడు చూస్తామా అని."
"షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది."
"మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, @RGVzoomin అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ష అంటూ వ్యాఖ్యానించారు. అయితే కత్తిహేష్ ట్వీట్ చేసిన తరువాత హీరోయిన్ పూనమ్ కౌర్ తనలోని ఆవేదనని వ్యక్తం చేస్తూ ట్వీ ట్ చేసింది.
ట్రూత్ (నిజం) అనే హ్యాష్ ట్యాగ్‌తో భారత దేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవింపబడుతూ, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. సాధారణ యువతులు దేని పైన అయినా నిందలు వేస్తూ ఉపయోగంలేని వారిగా చూపిస్తూ, సంబంధం లేని వాటిని వారికి అంటగడుతున్నా
యువతుల ఆత్మ, మనస్సు, శరీరం చంపేందుకు అంతా కలిసి అలాంటి యువతుల ఆత్మను, మనస్సును, శరీరాన్ని చంపేందుకు సిద్ధమవుతున్నారని పూనమ్ కౌర్ వాపోయారు. అమాయకులను ఇరికిస్తున్నారన్నారు. ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.