'పార్టీ మారినా నేతల ఇంటిమందు చావుడప్పు కొడతాం'

Update: 2018-12-23 10:09 GMT

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎదురుచూస్తుందని అన్నారు. మంత్రి వర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు గెలం వేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. టీఆర్ఎస్ లో సమర్థులైన నేతలు లేరా? అని పొన్నం ప్రశ్నిచారు. శాసనమండలి సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం సరికాదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లో ఈరోజు మీడియాతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు.  ఈ నేపథ్యంలో రాఫెల్ కుంభకోణంపై మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణం యావత్ దేశాన్నే కుదిపేసింది అయినా తెలంగాణలోని టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు స్పందించలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాఫెల్‌ కుంభకోణంలోని అసలు వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
 

Similar News