త్వరలో కాంగ్రెస్ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగునున్నట్లు సమాచారం.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్ ఫోన్స్‌ను విసిరారు. మైక్ గాంధీ ఫోటోను తాకి స్వామి గౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను వెంటనే కంటి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వంపై విపక్షాలు ఆందోళన చేయడం సహజమే అయినా దురుసుగా ప్రవర్తించడం, భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదని తెలంగాణ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ పత్రాలు చించేయడం, అవి విసిరి నిరసన వ్యక్తం చేయడం తరుచూ చూస్తుంటాం. కానీ గవర్నర్‌పైకి వస్తువుల విసరడం హేయమని సభ్యులు అంటున్నారు. ఏదైనా అసహనం ఉంటే దానిని వ్యక్తం చేయాలి గానీ భౌతికదాడులు చేయడం సమంజసం కాదని సభ్యులు అంటున్నారు. అందరూ ఇలాంటి ఘటనలను ఖండించాల్సన అవసరం ఉందన్నారు.
అయితే రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 11మంది ఎమ్మెల్యేలని సభ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అసెంబ్లీలో దురుసుగా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసన సభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే కోమటిరెడ్డి, సంపత్ లను అసెంబ్లీని తెలంగాణలోని నల్గొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అబిప్రాయపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి జరిగే ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.నల్గొండ, ఆలంపూర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ కార్యాలయం ఎన్నికల సంఘానికి సమాచారం పంపిందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్ రావు ధృవీకరించారు.