నరసరావు పేట, మాచర్లలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వారినివాసానికి వచ్చే దారిలో బారికేడ్ల్ పెట్టి, రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కాగా నేడు గురజాలలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ నేతలను అడ్డుకున్నారు. శాంతి భద్రతలు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని వైసీపీనేతలు ఆరోపిపస్తున్నారు. కాగా గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు పంపారు.