డీజిల్, పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరిగింది. ధరల పెరుగుదలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు పెద్ద ఎత్తున పెరిగాయని విపక్షాలు ఆరోపించాయి. 2014 నుంచి 2016 మధ్యలో 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచిందని విమర్శిస్తున్నారు. ఆయిల్ అమ్మకాలతోనే లక్ష కోట్లకు పైగానే ఆదాయం సమకూరిందని ఆరోపిస్తున్నాయ్.