పాదయాత్రలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌

Update: 2018-04-06 06:46 GMT

ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ జెజవాడ నినదించింది.  వామపక్షాలతో కలిసి జనసేన చేపట్టిన పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నలువైపుల నుంచి పోటెత్తిన జనంతో కిక్కిరిసింది.   జనసేన అధినేత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నేరుగా బెంజ్ సర్కిల్ చేరుకుని  పాదయాత్రలో పాల్గొన్నారు. బెంజ్‌సర్కిల్‌ వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర  రామవరప్పాడు కూడలి వరకూ సాగుతోంది. వేలాదిమంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పవన్‌ అభిమానులతో బెంజిసర్కిల్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఒకదశలో వాహనం దిగి పాదయాత్ర ప్రారంభించేందుకు పవన్‌ ఇబ్బందిపడాల్సి వచ్చింది. చివరకు పోలీసుల సాయంతో వాహనం దిగిన  పాదయాత్ర మొదలుపెట్టారు. జనసేన శ్రేణులు, వామపక్షాల కార్యకర్తలు ఉత్సాహంగా పవన్‌ వెంట కదిలారు. పాదయాత్రకు తరలివచ్చిన జనంతో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారి కోలాహలంగా మారింది.

Similar News