ఉద్దానం కిడ్నీబాధితులకు న్యాయం చేయాలని ఏపీ సర్కార్ కు పవన్ కల్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. పవన్ డెడ్ లైన్ కు మంత్రి లోకేష్ ట్వీట్ తప్ప ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో దీక్షకు దిగే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. కాసేపట్లో శ్రీకాకుళంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఏపీ సర్కార్ వైఖరి, నిరాహార దీక్ష పై చర్చించనున్నారు. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.