నీలో ఏదో విషయం ఉందోయ్ అంటూ ఓ సోషల్ మీడియా కు చెందిన ఓ వర్గం వారు కత్తి మహేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పవన్ కల్యాణ్ - కత్తిమహేష్ ల వివాదం పాలిటిక్స్ దగ్గర నుంచి ప్రారంభమై సినిమాలు, వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేస్తున్న పాలిటిక్స్ పై కత్తిమహేష్ స్పందించాడు. ఈ వివాదంలో వ్యక్తిగత విషయాలు పక్కనపెడితే ...కత్తిమహేష్, పవన్ కల్యాణ్ మేలుకోరుతున్నాడనేది ప్రస్పుటంగా అర్ధమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది నెలలు గా పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ తానెక్కడా తప్పుగా మాట్లాడడంలేదని విషయాన్ని సూటిగా చెబుతున్నాడు.
కత్తిమహేష్ ..!
అయితే ఈ నేపథ్యంలో ఓ మీడియా డిబెట్లో పాల్గొన్న కత్తిమహేష్ , పవన్ కల్యాణ్ ఫ్యామిలీ గురించి పలు ప్రశ్నలు సంధించాడు.అన్న చిరంజీవికి, మీ అమ్మగాకిరి తాను అత్తారింటికి వెళుతున్నట్లు చెప్పిన పవన్ నువ్వెళ్లి ఎక్కడ దాక్కూనే వాడివి మిస్టర్ పవన్ అని కత్తిమహేష్ ప్రశ్నించాడు. ఆప్రశ్నలు ఎలా ఉలా ఉన్నా....
జనసేన పార్టీ భవిష్యత్తు కార్యచరణ పై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ నాలుగేళ్లు నిండని పసిప్రాయం . అటువంటి పసిబిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా రాజకీయాల్లో ఒక భాగం. మనం పార్టీలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నాం. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో, లేదా మనదృష్టిని మరల్చడానికో , మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారిపై జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు స్పందించవద్దని కోరారు.
పవన్ కల్యాణ్ ట్వీట్ పై కత్తి మహేష్ పార్టీ పసిప్రాయంలో ఉండకపోతే ఎలా ఉంటుంది మరి. ఎదగక పోవడం అనేది వాళ్ళ లోపమే తప్పితే ఎవరో చేసిన కుట్ర కాదంటూ సూచించాడు. తాను చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ సీరియస్ గా స్పందించి ఉంటే బాగుండేదనని అన్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చిన పవన్ కల్యాణ్ గురించి ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ తనని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి తరుణంలో పవన్ తీరుపై.. నా విమర్శలు రాజకీయ పరంగా ఉన్నాయే తప్పితే వ్యక్తిగతంగా లేవు. వాళ్ళే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో నేను వ్యక్తిగతం అయ్యాను"అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా కత్తిమహేష్ .., పవన్ కల్యాణ్ మంచి గురించి చెప్పాడే తప్పా అందులో అతని స్వార్ధం లేదనే అనుమానాలు మొదలయ్యాయి. మరి దీనిపై ఎవరు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.