పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్ట్ నిర్మాణం వచ్చే ఎన్నికల నాటికీ పూర్తికాదు 2018 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందనేది శుద్ధ అబద్దమని సంచలన విషయాన్ని బయటపెట్టారు .. పోలవరం విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు.. గతంలో 125 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు కానీ ఇప్పుడది 50 వేల కోట్లకు ఎందుకు చేరిందో ఆలోచిస్తానని అన్నారు.. పోలవరం విషయంలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు..
కేంద్రానికి సరైన లెక్కలు చూపించలేకపోవడమే వివాదానికి దారితీసిందన్నారు .. కేంద్రప్రభుత్వమన్నాక ఇచ్చిన ప్రతి పైసాకు లెక్కలు అడుగుతుంది అంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం పనులు నిలిపివేయాల్సి అవసరమేముందని అన్నారు.. పోలవరం ప్రాజెక్ట్ ను ఏ పార్టీకో ఏ వ్యక్తికో కాదని ప్రజల అవసరాలు తీర్చడం కోసమని గుర్తుచేశారు..
ఇదిలావుంటే గతంలో ముఖ్యంమత్రి చంద్రబాబునాయుడు , భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమలిద్దరు 2018 లోపు పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు.. తాజాగా పోలవరంపై పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసి విధంగా ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు..