జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన నాగబాబుకి, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు . ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 'జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్ లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాగబాబు గారు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ కోటి రూపాయల వంతున పార్టీకి విరాళం అందజేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాగబాబు, వరుణ్ తేజ్ లు అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నా' అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.