శ్రీకాకుళం జిల్లాలో ఆరు రోజుల పాటు టిట్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.. టిట్లీ తుపాను కారణంగా 45 గ్రామాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్న పవన్.. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నారన్న పవన్.. తుపాను నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చెప్పకపోవడం వలనే సహాయం లభించడం లేదన్నారు.