అభిమాని మృతితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నీటిపర్యంతమయ్యారు. రెండురోజుల కిందట జనసేన ఫ్లెక్సీ కడుతూ.. ప్రమాదవశాత్తు శివ అనే అభిమాని మృతిచెందాడు. దీంతో శివ కుటుంబాన్ని పరామర్శించారు.. శివ భార్య , తలిదండ్రులను చూసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ గురువారం పాయకరావుపేట వస్తున్నట్టు తెలుసుకున్న ఆయన అభిమానులు శివ , నాగరాజు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, వాటికి ఉన్న ఇనుప చట్రం, పైన వున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.