పద్మావత్’ చిత్రంలో ఓ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై ఒక్కోరాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తు సినిమా విడుదల కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లో పద్మావత్ చిత్రం విడుదలకు సీఎం జైరాం ఠాగూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూపీలో ఈ చిత్రం విడుదలకు సీఎం యోగీ ఆధిత్యనాథ్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అనూహ్యంగా ఈ చిత్రం విడుదలకు అనుమతి లభించింది. రాష్ట్రంలో ఈ చిత్రంపై బ్యాన్ ఉండబోదని సీఎం జైరాం ఠాగూర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఈ సినిమా విడుదలపై నిషేధం ఉండబోదని ఆయన స్పష్టంచేశారు.