చిత్రం: పద్మావత్
నటీనటులు: దీపికా పదుకొణె.. షాహిద్ కపూర్.. రణ్‌వీర్ సింగ్ తదితరులు
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలి
నిర్మాత: సంజయ్ లీలా భన్సాలి.. సుధాన్సు వాట్స్.. అజిత్
వివాదాలతో యావత్ సినీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సినిమా పద్మావత్..!ఈ చిత్ర డైరక్టర్ సంజయ లీలా భన్సాలి చరిత్రను వక్రీకరించి తెరకెక్కించారనే ఆరోపణలతో రాజపుత్ వంశానికి చెందిన కర్ణీసేన ఆందోళన చేపట్టింది. 1540లో ఉత్తరప్రదేశ్ కు చెందిన సూఫీ కవిమాలిక్ మహ్మద్ జాయసీ ‘పద్మావత్’ అంటూ ఓ కవిత ను రాశారు. ఆ కవిత ఆధారంగా పద్మావత్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. మాలిక్ తన కవితలో క్రీ.శ. 13, 14 శతాబ్దంలో సింఘాల్ రాజ్య యువరాణి ,రాజ్ పుత్ ల ఆత్మగౌరవ నినాదమైన మహారాణి పద్మావతి అందచందాలకు దేశంలో అనేకమంది రాజులు ముగ్ధులవుతారు. చిత్తోర్‌గఢ్ పాలకుడైన రతన్‌సేన్ ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యస్థాపనకై ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి ఆక్రమించుకునేవాడు. అలా ఖిల్జీ కన్ను చిత్తోర్ గఢ్ రాజ్యం పై పడింది. ఈనేపథ్యంలో పద్మావతి సౌందర్యం గురించి తెలుసుకున్న ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవాలనే కాంక్షతో చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. ఈ దండయాత్రలో పద్మావతి భర్త రతన్‌సేన్ చనిపోతాడు. ఇక ఖిల్జీ ..పద్మావతిని వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుండగా ..అతనికి వశంకాకుండా అగ్నికి ఆహుతి అవుతుంది పద్మావతి. ఇది అసలు చరిత్ర.
అయితే ఈ కథను తెరకెక్కిన డైరక్టర్ సంజయ్ లీలా బన్సాలీ చరిత్రను వక్రీకరించి రాజ్ పుత్ ల ఆత్మగౌరవ నినాదమైన మహారాణి పద్మావతి , అత్యంత క్రూరుడైన అల్లువుద్దీన్ ఖిల్జీకీ మధ్య సినిమాలో చూపించనున్న రొమాన్స్ మీదనే మా అభ్యంతరం అంటూ రాజపుత్ వంశానికి చెందిన కొందరు ప్రముఖులు ఆందోళన చేపట్టారు. సినిమా విడుదల కాకుండా అడ్డుపడ్డారు. కానీ అన్నీఅవాంతరాలు దాటుకొని ఈనెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీమియర్ షో విడుదలైంది. ఆ ప్రీమియర్ షోలో సినిమా ఎలా ఉందంటే
కథేంటంటే...?:
ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్) రాజ్యస్థాపనకై ఇతర రాజ్యాలపై అక్రమంగా దండయాత్ర చేసి ఆక్రమించుకునేవాడు. తనకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదనే స్వభావం. ప్రపంచంలో తనకు ఏది అందంగా కనిపించిన వశం చేసుకునే అలవాటు ఉన్న ఖిల్జీ కి రాజ్‌పుత్ వంశానికి చెందిన పద్మావతి పై కన్నుపడింది. దీంతో ఎలాగైనా పద్మావతిని దక్కించుకోవాలనే కుట్రతో రాజపుత్ లపై యుద్ధం ప్రకటిస్తాడు. మరి అనుకున్నట్లు యుద్ధంలో విజయం సాధించాడా..పద్మావతిని దక్కించుకున్నాడా లేదంటే ఆమె వీరత్వానికి తలవంచుకున్నాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే...?:
చారిత్రక గాథల్ని తెరకెక్కించడంలో డైరక్టర్ సంజయ్ తనకు తనే సాటి. ఎమోషన్స్ , యుద్ధ సన్నివేశాల్లో ఆరితేరిన డైరక్టర్ పద్మావత్ సినిమాని కూడా అలాగే తెరకెక్కించాడు. ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సినిమా చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అయితే రాజ్ పుత్ ల కథ అంటే యుద్ధాలకు మారుపేరు. కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలు చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ భన్సాలీ యుద్ధ ఘట్టాల్ని పక్కనపెట్టి వీలైనంత డ్రామా ఎలివేట్ చేయడానికి చూశాడు. ఖిల్జీ అరాచకత్వం, అతని ఆలోచనలు, సింహాసనాన్ని అడ్డదారిలో అందుకున్న విధానం.. వీటితో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది.
చరిత్ర ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా తీయగలగాలి. ఆ విషయంలో భన్సాలీ ఇరగదీశాడనే చెప్పుకోవచ్చు. చరిత్ర అంటే ఇష్టపడే ప్రేక్షకుడు , చరిత్ర గురించి అవగాన లేని ప్రేక్షకుడు సైతం సినిమా అర్ధమయ్యేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా రాజ్ పుత్ వంశానికి చెందిన పద్మావతి ఎనిమిది వందల మంది దాసీలతో ఖిల్జీపై దండేత్తిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. నిజజీవితంలో కంటే ఈ సినిమాలో రాజ్ పుత్ ల త్యాగాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు భన్సాలీ. ఫస్టాఫ్ లో సినిమాలో పాత్రల్ని పరిచయడం చేయడంలో సఫలీకృతుడైన డైరక్టర్ సెకెండ్ ఆఫ్ లో సినిమాను ఆసక్తిగా మలచడంలో విజయం సాధించాడు.
చరిత్రను వక్రీకరిస్తే ఎలాంటి పరిణాలు చోటుచేసుకుంటాయో భన్సాలీ కి బాగా తెలుసు కాబట్టే ఈ సినిమాలో వివాదాలకు దూరంగా కథను నడిపించాడు. కాకపోతే కొన్ని చోట్ల సెన్సార్ దెబ్బకు స్టోరీ జంప్ అయినట్లు అనిపిస్తుంది. దీంతో అక్కడక్కడ గందరగోళం నెలకొంది.
ఎవరెలా చేశారంటే..: పద్మావత్ కథ ఆసాంతం రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహీద్ కపూర్ ల చుట్టూ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్ని శక్తిమంతంగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈమూడు పాత్రల్లో ఖిల్జీ గా యాక్ట్ చేసిన రణవీర్ సింగ్‌కి దక్కుతాయి. ఖిల్జీగా క్రూరత్వాన్ని అద్భుతంగా పండించాడు. వీరనారి పద్మావతిని దక్కించుకోవడానికి ఖిల్జీగా రణ్ వీర్ నటన ఆకట్టుకుంది. దీపికా పదుకొణె ఈ సినిమా కోసం పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లో స్పష్టంగా తెలుస్తోంది. రొమాంటిక్ పాత్రల్లో కనిపించే షాహిద్ కపూర్ రాజ్‌పుత్ వీరుడిగా మలిచిన తీరు బాగుంది. ప్రతీపాత్రను తీర్చిదిద్దడంలో భన్సాలీకి మంచి మార్కులే పడ్డాయి. పాటల్లో దమ్ము తగ్గినా పాటల్లోని బీజియమ్స్, రాజ దర్బార్, కోటలు , సీజీ వర్క్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. స్ననివేశాలపై అంత దృష్టి పెట్టలేదు. భన్సాలీ దృష్టంతా డ్రామాపైనే ఉంది.