వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మరింత బలంగా ఉండాలని భావిస్తోంది అధికార టీఆరెస్ పార్టీ.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆ పార్టీ
సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మండలిలో కాంగ్రెస్‌పై పైచేయి సాధించిన టీఆర్ఎస్.. శాసనసభపైనా దష్టి పెట్టింది. 88 మంది సొంత ఎమ్మెల్యేలకు తోడు.. ఇద్దరు స్వతంత్రుల చేరికతో ఆపార్టీకి 90 మంది శాసన సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిని కారు ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన అనుచరులతో సమావేశమవడం హాట్ టాపిక్ అయింది. అశ్వారావుపేట నుంచి సైకిల్ గుర్తుపై గెలిచిన మెచ్చా నాగేశ్వర్‌రావుతోను ఆయన మంతనాలు సాగించారు. మెచ్చా మాత్రం తాను టీడీపీని వీడేది లేదని తెగేసి చెప్తున్నారు. ఎలాగోలా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రమాణస్వీకారానికి ముందే టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. కానీ ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారా అన్న చర్చ మొదలయింది.