చాలా కాలంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న పేరును.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూటగట్టుకున్నారు. ఆ మాటకొస్తే.. ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశించి పవన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. సీనియర్ రాజకీయ నాయకుడు.. మంచి అనుభవజ్ఞుడు అంటూ గౌరవంగా సంబోధించారు తప్ప.. విమర్శనాత్మకంగా ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదు.
ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందించిన సహాయంపై ఉమ్మడి నిజ నిర్థారణ కమిటీ రూపొందించిన నివేదికపై మాట్లాడిన సందర్భంగా.. మరోసారి చంద్రబాబు అనుకూల వైఖరిని పవన్ ప్రదర్శించారు. ఈ నెల 21న పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తీరును పవన్ తప్పుబట్టారు. అప్పుడు అవిశ్వాసం పెడితే… చర్చకు అవకాశం ఉండదన్నారు.
ఈ నెల ఐదునే.. అంటే నేడు అవిశ్వాసం పెడితే చర్చకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే వాదనను.. టీడీపీ అనుకూల మీడియా కూడా చేస్తోంది. అందుకే.. మళ్లీ పవన్.. చంద్రబాబు అనుకూల వైఖరి ప్రదర్శించినట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పవన్ మరింత స్పష్టత ప్రదర్శిస్తే.. జనసేన వైఖరిపై జనానికి కూడా క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరి.. పవన్ ఏమంటారో..?