అదిరిపోయిన ఆమ్రపాలి వెడ్డింగ్ కార్డు

Update: 2018-02-10 12:17 GMT

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే.. ఒక కలెక్టర్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే కేవలం ఆమె పనితీరు మాత్రమే.. ఒక అధికారిగా కాకుండా మాములు వ్యక్తి గా ఆమె అందరిని ఆకర్షించింది.. అయితే ఈ నెల 18న ఆమె ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకోనుంది.. ఈ ఇరువురి వివాహం జమ్మూ కశ్మీర్‌లో వీరి పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన సమీర్ శర్మతో ఆమ్రపాలి ప్రేమలో ఉండి చివరకు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నెల 23వ తేదీన వరంగల్‌, 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు.
 
అయితే ఆమె తన సన్నిహితులకు ఇవ్వనున్న ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కార్డు చాలా ఖరీదైనదిగా చెబుతున్నారు. అయితే ఈ కార్డును ప్రత్యేక అతిథులకు మాత్రమే ఇవ్వనున్నారు. ఆ కార్డు మొదటి పేజీలో పెళ్లికి సంబంధించిన చిత్రాలను క్లాత్‌పై పెయింటింగ్ వేసి తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 25న ఆమె కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమైన అతిథులకు విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమె వరంగల్‌కు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. అయితే పెళ్లికి సంబంధించిన ఆహ్వాన ప్రతికలను రెండు రకాలుగా ప్రింట్ చేయించారు. ప్రముఖులకు ఖరీదైన కార్డు, మిగతావారికి మామూలు కార్డులను ఫ్రింట్ చేయించారు.

Similar News