నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ నేటి తరం హీరోలతో పోటీ పడుతున్నారు. పైసావసూల్, జైసింహాలతో బిజీగా ఉన్న బాలయ్య త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ లో యాక్ట్ చేస్తున్నారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నాడు.
ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎవరు చేయబోతున్నారు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులోభాగంగా బసవతారకంగా ఎవరిని తీసుకోవాలో చిత్రయూనిట్ కసరత్తులు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ లో డైరక్టర్ తేజ స్పీడు పెంచాడు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీ నటుల విషయంలో ఆడిషన్స్ తీసుకుంటున్న డైరక్టర్ ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు.
ఈ సినిమాకు సంబంధించిన జనవరి 18న టీజర్ రిలీజ్ అవుతుందని భావించారు. అయితే నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ తాలూకు టీజర్ ను రిలీజ్ చేయట్లేదని మొన్ననే స్వయంగా బాలయ్యే చెప్పారు.
ఇకపోతే ఈ సందర్భంగా సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ సంతకానికి దగ్గరగా ఉండేలా ఎన్.టి.ఆర్ అనే అక్షరాలను రూపొందించడం.. అలాగే వెనుక ఇంగ్లీషులో కూడా అదే అక్షరాలు పెట్టడం.. చాలా బాగుందే చెప్పాలి.