ఏపీలో టీడీపీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు అలా లేదని, పనితీరునే ప్రజలు ప్రమాణంగా తీసుకుంటున్నారని అన్నారు.
నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదిరిస్తారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.