కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది వైసీపీ. ఇంతలోనే వైసీపీ నేతలు నిర్ణయం మార్చుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి రెడీ అయ్యారు. పార్టీ అధినేత జగన్ ఒప్పుకుంటే వైసీపీ తరపున, అంగీకరించకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు గౌరు వెంకట్ రెడ్డి.