అమిత్ షాకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ సమస్యలపై అమిత్ షాకు అవగాహన లేదన్న విషయం ఆయన రాసిన లేఖతో స్పష్టమైందన్నారు. కేంద్రానికి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపుతున్నామని లోకేష్ చెప్పారు.
యూసీకి, హోదాకు సంబంధం లేదన్నారు. హోదా సహా 18 హామీల అమలుకు యూసీ అవసరమా అని ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి తాము ఆవేశంలో బయటకి రాలేదని చెప్పారు. మంత్రి పదవులకు రాజీనామా చేశాక కూడా ఎన్డీయేలోనే ఉన్నామన్న విషయం గుర్తుచేశారు. త్వరలోనే అమిత్ షాకు సీఎం చంద్రబాబు సమాధానం ఇస్తారని తెలిపారు.