నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్తి శ్రీనివాస్ దారుణహత్యకు గురయ్యాడు. నల్గొండ సావర్కర్ నగర్ లో శ్రీనివాస్ హత్య సినీ ఫక్కిలో జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఒకరిపై ఒకరి ఘర్షణకు దిగారు. అయితే ఈ వివాదాన్ని సర్ధి చెప్పేందుకు స్థానిక కౌన్సిలర్ మెరుగు గోపి కృష్ణ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో గోపి, శ్రీనివాస్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
సమాచారం తెలుసుకున్నశ్రీనివాస్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వచ్చింది. ఈ క్రమంలో నిందితులు శ్రీనివాస్ ను డ్రైనేజీలో పడేసి అత్యంత పాశవింకగా తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం శ్రీనివాస్ డెడ్ బాడీని పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసిన ఐదుగురు దుండగులు నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మృతుడు శ్రీనివాస్ , తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అయితే శ్రీనివాస్ హత్య గురించి సమాచారం అందుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాదు నుంచి నల్గొండ చేరుకుని బాధితుడు కుటుంబానికి ధైర్యం చెప్పారు. హత్యగురైన తన అనుచరుడిని చూసి తట్టుకోలేకపోయిన కోమటిరెడ్డి బోరున విలపించాడు.
ఈ హత్య కావాలనే చేసినట్లు కోమటి రెడ్డి ఆరోపించారు. గతంలో శ్రీనివాస్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయని వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈహత్య జరిగిందన్న కోమటి రెడ్డి..బంద్ కు పిలుపునిచ్చారు