మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఆయన సైకిల్ పార్టీలో కింగ్ లా ఉండేవారు. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అనుకోని ఘటనల తర్వాత నాగం జనార్దన్ రెడ్డి ఎవరితో కలవకుండా ఉండిపోయారు. కానీ అనుకోకుండా రాజకీయాలకు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు కమలం చెంతకు చేరారు. అక్కడ ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదిపారు.
అయితే మహబూబ్ నగర్ జిల్లాలో స్టామీనా ఉన్న లీడర్ నాగం కాంగ్రెస్ లో చేరితే చేరితే తమ పలుకుబడి తగ్గుతుందని స్థానిక కాంగ్రెస్ నాయులు ఆందోళను చెందుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టే కాంగ్రెస్ శాసన సభ్యురాలు డీకే అరుణ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య లు ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నాగం కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువని అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో నాగం కాంగ్రెస్ లో చేరడం కష్టమేనని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత నాగం చేరిక స్తబ్ధుగా ఉన్న మరోసారి నాగం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించేలా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ..వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. కొద్దిరోజుల క్రితం నాగం రాకను కాంగ్రెస్ జేజమ్మ డీకేఆరుణ వ్యతిరేకించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తు చేయాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం నుంచి జిల్లా నేతలకు గట్టి సంకేతాలు అందినట్లు తెలిసింది.
దీంతో కాంగ్రెస్ లో నాగం వ్యతిరేకవర్గం కాస్త వెనక్కితగ్గినట్లు పొలిటికల్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి రాకను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మరోవైపు రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొప్పుల రాజు .. నాగం చేరిక విషయంలో ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా పలువురు సీనియర్లతో భేటీ అయ్యారు. దాదాపుగా సుధీర్ఘ చర్చ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి లైన్ క్లియర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.