న్యాచురల్ స్టార్ నాని- హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ లో ఎంసీఏ అనే సినిమావిడుదలైన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా విడుదలతో మంచి టాక్ ను సొంతం చేసుకొని హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ సాయిపల్లవి - నానికి మధ్య గొడవలు జరిగాయిని..ఆ గొడవల్ని నిర్మాత దిల్ రాజు పరిష్కరించారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన నాని అదేంలేదని ..సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని కొట్టిపారేశాడు.
ఇప్పుడు ఆ వివాదాన్ని హీరో నాగశౌర్య తిరగతోడుతున్నాడు. సాయి పల్లవి నాగ శౌర్య కలిసి నటించిన కణం అనే సినిమా చేస్తున్నారు. ఇప్పుడు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు నాగశౌర్య ఇంటర్వ్యూలో చెప్పాడు. హీరోయిన్ సాయి పల్లవికి ఇగో చాలా ఎక్కువ. సాయి పల్లవికి తాను అందరి కంటే ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. కొందరు హీరోల కంటే తనకే పెద్ద ఇమేజ్ ఉందనేలా ఫీల్ అవుతూ ప్రవర్తిస్తుందని అన్నాడు. కణం సినిమా ప్రమోషన్ పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇద్దరు నటిస్తున్నప్పుడు ప్రమోషన్ లో ఒక్కరినే హై లైట్ చేయటం పట్ల నాగ శౌర్య అసంతృప్తితో ఉన్నాడట. దీని గురించి సాయి పల్లవి స్పందన ఇంకా రావాల్సి ఉంది. ఎమైతుందో చూడాలిమరి