లిఫ్ట్‌లో జగన్‌ చెప్పిన మాటలు ఇవే..

Update: 2018-10-25 14:42 GMT

విశాఖ ఏయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి.. వేల ప్రశ్నలను సంధిస్తోంది..? అసలు ఈ దాడి వెనుకు ఎవరున్నారు..? ఎందుకు చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో.. శ్రీనివాస్ చేసిన దాడి పై జగన్‌ ఏమంటున్నారు..? నిజానికి జగన్‌కు జరిగిన గాయం చిన్నదైనా.. దుండగుడి లక్ష్యం చిన్నపాటి గాయం చేసి వదిలేయడమేనా..? లేక జగన్‌పై భారీ దాడి చేయాలనుకుని.. వదిలేశాడా..? అసలు జగన్‌పై ఎక్కడ అటాక్‌ చేయాలని అనుకున్నాడు..? ఇదే అంశంపై జగన్‌ తన అంతరంగిక వ్యక్తులతో ఏమన్నారో వెలుగుచూసింది. శస్త్ర చికిత్స కోసం సిటీ న్యూరో ఆస్పత్రికి వెళ్లే సమయంలో.. లిఫ్ట్‌లో జగన్‌ చెప్పిన మాటలు.. సంచలనం రేపుతున్నాయి. 

ముందుగా కత్తిని మెడపై వేటు వేయాలని అనుకున్నాడని.. కానీ అది అదుపుతప్పి.. తన చేయిపై పడిందని.. లిఫ్ట్‌లో ఉన్న తన అంతరంగీకులతో జగన్‌ చెప్పారు. దాడి విషయాన్ని వివరిస్తూ.. జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే రోజా.. అదృష్టం బాగుందని.. దేవుడి దయ వల్ల బయటపడ్డామంటూ వ్యాఖ్యానించారు. 
 

Similar News