కృష్ణా జిల్లా బాపులపాడులో దారుణం జరిగింది. స్ధానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన దుండగులు కాళ్లు కట్టేసి చేతులు నరికారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొనఊపిరితో ఉన్న పద్మను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది కాలంగా భర్తకు దూరంగా ఉంటూ... బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.