తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తమ అధినేతను ప్రసన్నం చేసుకునేలో పడ్డారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీడీపీ , నారాలోకేష్ అవినీతి గురించి పవన్ విమర్శలు చేశారు. ఏపీ టీడీపీ నేతలు అవినీతితో రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తున్నారని సూచించారు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని ..టీడీపీ నేతలు ఏపీని కరప్షన్ ఆంధ్రాగా మార్చేస్తారని ఎద్దేవా చేశారు.
ఎక్కడో తెలంగాణలో ఉన్న భూకబ్జాల సంస్కృతిని వైజాగా దాకా తెచ్చి మీరా..? కాదా అని ప్రశ్నించారు. ఇక మంత్రి నారాలోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019ఎన్నికల్లో వైసీపీ పై పోటీ చేసేందుకు అవినీతికి పాల్పడుతున్నమని గుంబనంగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
29సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదో తన వద్ద సమాచారం ఉందని సూచించారు. చంద్రబాబును ఉద్దేశిస్తూఏ మీరు ఓటుకునోటు కేసు, మీ అబ్బాయి నారాలోకేష్ తమిళనాడుకు చెందిన ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి హస్తం ఉందని , అందుకు మోడీ అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని అన్నారు.
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు - తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ ను ఇన్నిరోజులు గబ్బర్ సింగ్ అనుకున్నాం కానీ నిన్నటి వ్యాఖ్యలతో అజ్ఞాతవాసి అయ్యారని ఏపీ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అత్తారింటికి దారేదేలో హీరో అయిన పవన్ కల్యాణ్ కు తన అత్తారింటికి దారేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై నోటికి పని చెప్పిన మోత్కుపల్లి వార్డుమెంబర్ గా కూడా గెలవని పవన్ కల్యాణ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పీఆర్పీలో డబ్బు కోసం టికెట్లు అమ్ముకున్న వ్యక్తి మీరు కాదా అని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న తెలంగాణ - ఏపీ సభల్లో చంద్రబాబు ను ఆకాశానికెత్తిన పవన్ ఒక్కసారి రివర్స్ అవ్వడానికి ఎంత ప్యాకేజీ తీసుకున్న పవన్ అని ఆరోపించారు. నారాలోకేష్ అవినీతి చేశారని ప్రశ్నించారు. మీదగ్గర రుజువులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. లేదంటే పవన్ కల్యాణ్ ను ప్రజలు బట్టలూడదీ కొడతారని మోత్కుపల్లి వ్యాఖ్యలు చేశారు.