హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ఓ ఇంట్లో పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో చలి తీవ్రతకు తట్టుకోలేక బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో.. ఇల్లంతా పొగ చుట్టేసింది. దాంతో ఊపిరాడక తల్లీ బుచ్చివేణి 37 , కుమారుడు పద్మరాజు 20 మృతిచెందారు.. భారీగా పొగ వస్తుండటంతో భయబ్రాంతులకు గురైన సత్యబాబు బయటి నుంచి ఎంతసేపు తలుపుకొట్టినా తీయలేదు. ఈ తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు విగతజీవులుగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా వారు పనిచేస్తున్న యజమాని ఇంట్లో కుక్క కూడా నిన్ననే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.