మీనా ఎన్‌కౌంటర్ బూటకం...మావోల ఆడియో విడుదల

Update: 2018-10-15 08:21 GMT

మావోయిస్టు మీనా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని మావోయిస్టు కైలాశం తెలిపారు. ఆయన పేరుతో విడుదలైన ఓ ఆడియోలో.. ఎన్‌కౌంటర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని.. మావోయిస్టులను పట్టుకుని వచ్చి కాల్చిచంపారని.. ఆరోపించారు. కేవలం ఏవోబీలో భయానక వాతావరణం సృష్టించేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కైలాసం.. ఏవోబీలో మళ్లీ పుంజుకుంటామని తెలిపాడు. 
ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా చంపేశారని అన్నారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు.
 

Similar News