జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ పర్యటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ పర్యటనపై అధికార పార్టీ ఒకలా, పవన్ కల్యాణ్ మరోలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
పవన్‌కల్యాణ్ - కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం జరిగాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ .. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. పవన్ ను తాము రాజకీయ నేతగా చూడటం లేదన్నారు. సినీ నటుడిగానే పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. అజ్ఞాతవాసి కు ఐదు షోల అనుమతి కోసం సీఎం కేసీఆర్‌ను కలిశారని కర్నె అన్నారు.
ఇక కాంగ్రెస్ నేతల విమర్శలపై స్పందించిన పవన్ కల్యాణ్ ఇదిగో ఇలా సీఎం కేసీఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు కలిసిశానని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను ప్రజలు నమ్మారని చెప్పారు పవన్. కాబట్టే కేసీఆర్ ని ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారని సూచించారు.
ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ను పవన్ కల్యాణ్ ఎందుకు కలిసారో చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాటలకు..తాను సీఎం కేసీఆర్ ఎందుకు భేటీ అయ్యానోనని పవన్ చెప్పిన మాటలకు పొంతనలేదని కాబట్టే వీరిద్దరి లోగుట్టు పెరుమాళ్ల కెరుకా అంటూ గుసగుసలాడుతున్నారు నెటిజన్లు