ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్బంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. దీనివల్ల ఏపీలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని.. వాటని ఎదుర్కొంటూనే అభివృద్ధి దిశలో పయనిస్తున్నామని చెప్పారు. అలాగే 2029 కల్లా దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.