కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

Update: 2018-02-18 04:45 GMT

సరికొత్త ఆటిట్యూడ్ తో.. ఎనర్జిటిక్ లుక్ తో.. పాలనలో తన స్పెషల్ మార్క్ ను చూపిస్తూ.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరుగాంచిన తెలంగాణ ఐటీ మినిస్టర్.. కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రత్యేకంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర అభివృద్దితో పాటు.. భారత్ ను ప్రపంచం ఎలా గుర్తిస్తుందన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. 

ప్రపంచానికి ఇండియానే దిక్సూచి అని ఆ విషయాన్ని మిగతా దేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  అన్నారు. చెన్నైలో శనివారం నిర్వహించిన మద్రాస్ మేనేజ్ మెంట్  అసోసియేషన్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లర్నింగ్ టు గ్రో అనే అంశంపై  కేటీఆర్ అనర్ఘలంగా మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం యంగ్ గా ఉందని సగానికి పైగా జనాభా పాతికేళ్ల లోపే ఉందని వివరించారు. దేశానికి ఉన్న యువశక్తే దాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి నడుపుతుందని వివరించారు. యువత ఆశలకు, అకాంక్షలకు ప్రభుత్వాలు ఆసరా అందిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుందని అందుకే ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల మాదిరి ఆలోచించి సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. 

వినూత్న విధానాలు, ముందుచూపు ఉన్న నాయకత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా కేటీఆర్  వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించిన కేటీఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్  బిజినెస్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న అంశాన్ని గుర్తు చేశారు. 

Similar News