జగన్ ఆది నుంచి అభివృద్ధిని అడ్డకుంటూ పాదయాత్ర ద్వారా అసత్యాలు వల్లెవేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. పాదయాత్ర ఓ పవిత్రమైనదని ఎందరో చేశారని జగన్ చేస్తుంటే మాత్రం మార్నింగ్, ఈవెనింగ్ వాక్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఆరోగ్యం కోసం మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. జగన్ పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రజా సమస్యలపై జగన్ పాదయాత్ర చేయడం లేదని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.