ఏపీ సీఎం చంద్రబాబుపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాబుతో పాటు ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు, టీడీపీ నేతల బండారాన్ని, ఎంపీల వ్యవహారాల గురించి సాయిరెడ్డి మాట్లాడటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ..విజయసాయిరెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఒక కుసంస్కారి అని...వైసీపి సంస్కారం లేని పార్టీ అని విమర్శించారు. తప్పుడు లెక్కలు, దొంగ కంపెనీలు పెట్టడంలో విజయసాయి దిట్ట అని అన్నారు. మోదీ కాళ్ళు పట్టుకున్న విజయసాయిని దేవుడు కూడా కాపాడలేడని తెలిపారు. తన పెద్దల పేరుతో ట్రస్ట్ నడువుతున్నా తప్ప తనకు క్లబ్బులు లేవని స్పష్టం చేశారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని మంత్రి వివరించారు. తనపై చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే ఉరి తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ అంటే బీ ఫర్ బీజేపీ, జె ఫర్ జగన్, పి ఫర్ పవన్ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.