వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణానికి జగన్ దరిద్రమే కారణమని అన్నారు. పొరపాటున జగన్ ముఖ్యమంత్రి అయితే... ఏపీని విదేశాలకు తాకట్టు పెడతారంటూ ఆరోపించారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా కడపలో ఆదినారాయణ రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. నాలుగేళ్ళు వేచి చూసి విసిగిపోయి దీక్షకు దిగామని చెప్పారు. సీఎం చంద్రబాబు దీక్షతో మరో ప్రజా ఉద్యమం వస్తోందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.