నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందని ప్రియురాలి ఇంటి ముందు ధర్నా నిర్వహించాడు. ప్రియుడి ధర్నాకు స్థానిక యువకులు మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియుడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మక్లూర్ మండలం మాదాపూర్‌కు చెందిన ఎర్రోళ్ల రవి ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వేల్పూర్ మండలం పడిగేల్‌కు చెందిన యువతిని పదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. అయితే, తన ప్రేమను కాదని, మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైందని ఎర్రోళ్ల రవి యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు.