గత వారం ఎస్వీ మెడికల్ కాలేజీలో శిల్ప ఆత్మహత్య ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీలో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్వీ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక బలవన్మరణానికి పాల‍్పడింది. గీతిక ఆత్మహత్యకు వెనుక గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రొఫెసర్ల వేధింపులపై గత కొంతకాలంగా మెడికోలు ఆందోళన చేస్తున్నారు. కాగా మహిళా విద్యార్ధులను కొంతమంది ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని.. అందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థినులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని వారు కోరుతున్నారు.