హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నడిరోడ్డుపై జరిగిన ఘోర హత్య మరువకముందే అలాంటి మరో ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. మాచర్లలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. బార్ లో మద్యం సేవించి బయటకు వస్తున్న యువకుడిని బయట కాపుకాసి ఉన్న నలుగురు వ్యక్తులు, ఒక్కసారిగా ఎటాక్ చేసి కత్తులతో నరికి చంపారు. మృతుడు చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గా గుర్తించారు. ఓ మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రేమ్ కుమార్ తన భార్యను కలిసేందుకు వచ్చాడు. ఈ విషయం తెలియడంతో బులెట్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెంబడించిన దుండగులు దాడి చేసి చంపారు.