ఇంటి నుంచి గోవాకు బయలు దేరిన ప్రముఖ నటుడు శవమై కనిపించాడు. అయితే స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలా చనిపోయాడు..? ఎందుకు చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ మలయాళ నిర్మాత పీకేపీ పిళ్లై కుమారుడు సిద్ధు శవమై కనిపించారు. ఆయన మరణవార్త గురించి తెలుసుకున్నఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే సిద్ధు జనవరి 12న ఇంటినుంచి బయలు దేరి గోవా బీచ్ ఒడ్డున శవమై తేలారు. అలా వెళ్లిన సిద్ధు మరణించడంతో ఆయన బీచ్ లో ప్రమాదవశాత్తూ కన్నుమూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు.
‘సిద్ధు ఆర్ పిళ్లై మృతి నన్ను చాలా బాధించింది. ‘సెకండ్ షో’ సినిమా షూటింగ్‌లో చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’ అని దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశారు.